కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ‘బెంజ్’. ఈ సినిమాను బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్ట్ చేస్తుండగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి.
అయితే, తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ముగించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర అయిన వాల్టర్‌గా మలయాళ నటుడు నివీన్ పాలీ నటిస్తున్నాడు. ఇటీవల ఆయన ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయగా దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది.
ఈ ‘బెంజ్’ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.