తెలుగులో రానున్న ‘ఓకే ఓకే’


టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కి తమిళ చిత్రాలపై ఉన్న మోజు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. తమిళంలో విజయం సాదించిన ‘కావలన్’ చిత్రాన్ని తెలుగులో ‘బాడీగార్డ్’ గా నిర్మించిన బెల్లకొండ ప్రస్తుతం నాగ చైతన్య మరియు సునీల్ హీరోలుగా ‘వేట్టై’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎమ్. రాజేష్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ‘ఓకే ఓకే (ఒరు కల్ ఒరు కన్నాడి)’ చిత్రం యొక్క డబ్బింగ్ రైట్స్ ని బెల్లంకొండ దక్కించుకున్నారు. హారీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను జూలై 9న హైదరాబాద్లో విడుదల చేయనున్నారు.ఉదయనిది స్టాలిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హన్సిక కథానాయికగా నటించారు. సంతానం, షియాజీ షిండే మరియు శరణ్యలు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version