డమరుకం వైజాగ్ హక్కులు దక్కించుకున్న బెల్లంకొండ

డమరుకం వైజాగ్ హక్కులు దక్కించుకున్న బెల్లంకొండ

Published on Aug 27, 2012 8:23 PM IST


నాగార్జున హీరోగా నటిస్తున్న ఫాంటసి సినిమా ‘డమరుకం’ చిత్రానికి సంభందించిన వైజాగ్ పంపిణీ హక్కులు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. ప్రతుతం అన్నపూర్ణ స్టుడియోలో ప్రత్యేక పాట చిత్రీకరణలో ఉన్న ఈ చిత్ర ఆడియోని సెప్టెంబరు 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరొయిన్ గా నటిస్తుంది. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే అత్యదిక బడ్జెట్ తో రూపొందుతుంది. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు