ఇలియానాకి పరీక్ష కానున్న ‘బర్ఫీ’


“బర్ఫీ” చిత్రంతో ఇలియానా హిందిలో పరిచయం కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల కానుంది అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా మరియు ఇలియానా ప్రధాన పాత్రలు పోషించారు. గత కొన్ని వారాలుగా ఈ చిత్ర ప్రమోషన్లో ఇలియానా పాల్గొంటూ వచ్చారు. ఈ చిత్ర విజయం మీద ఆమె చాలా నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు.”జులాయి” చిత్రంతో విజయం దక్కినా ఇలియానా కళ్ళు మొత్తం బాలివుడ్ మీదనే ఉన్నాయి. తెలుగు లేదా తమిళంలో ఏదయినా మంచి పాత్ర వస్తే ఆమె చెయ్యచ్చు లేదా చెయ్యకపోవచ్చు. ప్రస్తుతం ముంబైలో ఒక ఇల్లు కోసం వెతుకుతున్నట్టు సమాచరం ఇది చూస్తుంటే ఆమె బాలివుడ్ కెరీర్ మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో అనే విషయం తెలుసుకోడానికి ఈ చిత్రం ఒక పరీక్ష వంటిది. ఆమెకు బాలివుడ్ లో మరిన్ని పాత్రలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే పలువురు విమర్శకుల నుండి ఆమె నటన ప్రశంసలు పొందింది. కాని అసలు పరీక్ష సెప్టెంబర్ 14న ఉండబోతుంది. ఇలియానా బాలివుడ్ లో స్థిరపడగలుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.

Exit mobile version