సుకుమార్ తరువాత బన్నీ ఆయనకే ఫిక్స్ అట..!

బన్నీ-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమా టాలీవుడ్ థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది. కాగా తన తదుపరి చిత్రం బన్నీ సుకుమార్ తో చేస్తున్నారు. ఇది కూడా సుకుమార్-బన్నీ ల హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని సమాచారం.

కాగా బన్నీ ఈ చిత్రం తరువాత మళ్ళీ త్రివిక్రంతో చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ మూవీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తున్న సమాచారం. సుకుమార్ మూవీతో బన్నీ, ఎన్టీఆర్ మూవీతో త్రివిక్రమ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కొంచెం అటూ ఇటుగా ఇద్దరూ ఒకేసారి ఫ్రీ అవుతారు. కాబట్టి నెక్స్ట్ మూవీ కొరకు జత కట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ నిజంగా ఈ కాంబినేషన్ సెట్టైతే ఫ్యాన్స్ కి పండగే.

Exit mobile version