బాలీవుడ్ ని దున్నేయడానికి బన్నీ, సుకుమార్ స్పెషల్ ప్లాన్స్

బాలీవుడ్ ని దున్నేయడానికి బన్నీ, సుకుమార్ స్పెషల్ ప్లాన్స్

Published on May 14, 2020 8:36 AM IST

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సుకుమార్ తో ఆయన చేస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప పాన్ ఇండియా మూవీగా సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. కాబట్టి బాలీవుడ్ ఎంట్రీకి సుకుమార్, బన్నీ ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నారట. సుకుమార్ టేకింగ్ పై, బన్నీ యాక్టింగ్ పై ఫోకస్ పెట్టనున్నారట. అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా సుకుమార్ స్క్రిప్ట్ లో తగు మార్పులు, జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బన్నీ ఐతే తన యాక్టింగ్, డాన్సింగ్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.

పుష్ప సినిమాలో బన్నీ స్టెప్స్ కూడా అద్భుతంగా ఉంటాయని వినికిడి. ఇది పల్లె నేపథ్యంలో సాగే స్టోరీ నేపథ్యంలో ఫోక్ బీట్ లో సాగే సాంగ్స్ కి బన్నీ మాస్ స్టెప్స్ అలరిస్తాయని సమాచారం. ఇప్పటికే బన్నీ డాన్సింగ్ స్కిల్స్ ఏమిటో బాలీవుడ్ కి బాగా తెలుసు. అనేక మంది సెలెబ్రిటీలు బన్నీ డాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడం జరిగింది. ఏదిఏమైనా సుకుమార్, బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు