బ్యాంక్ రాబరీ థీంగా డీ ఫర్ దోపిడీ

d-for-dopidi
బ్యాంక్ రాబరీని థీంగా చేసుకొని రాజ్ కల్ల ఓ థ్రిల్లర్ సినిమాని తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘డీ ఫర్ దోపిడీ’. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, మలానీ, రాజేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డి.కె కృష్ణ – రాజ్ నిడిమోరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బ్యాంక్ రాబరీ చేసి త్వరగా
ధనవంతులు అయిపోవాలి అనుకునే నలుగురు యువకుల కథని ఇందులో చూపించనున్నారు.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో జనవరిలో విడుదల కానుంది, అదే నెలలోనే సినిమాను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ శంకర్ సంగీతం అందించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, హేమ, రాజ్ పిప్పళ్ళ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు

Exit mobile version