యంగ్ హీరో నవదీప్, తెలుగు భామ స్వాతి జంటగా నటించిన ‘బంగారు కోడిపెట్ట’ సినిమా చాలా సార్లు వాయిదా పడినా ఎట్టకేలకు శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేసారు. కానీ అదే సమయంలో మరో మూడు సినిమాలు కూడా రిలీజ్ కానుండడంతో ఈ చిత్ర విడుదలని తాజాగా వాయిదా వేసారు. మార్చి 7న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నవదీప్ తెలియజేశాడు.
గతంలో బోణి సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ పిప్పళ్ళ ఈ మూవీకి డైరెక్టర్. గురు ఫిల్మ్స్ బ్యానర్ లో సునీత తాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేష్ శంకర్ సంగీతం అందించాడు. సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ మూవీలో తన డ్రీమ్స్ కోసం ఏమన్నా చేసే వ్యక్తిలా కనిపించే పాత్రలో నవదీప్ కనిపిస్తే, స్వాతి బబ్లీ గర్ల్ పాత్రలో కనిపించనుంది.