బంగారు ఏనుగు కోసం పోటీ పడుతున్న మామిడి పండు కథ

MamidiPandu-Katha
గతంలో అడపాదడపా బాలల సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా వచ్చేవి. కానీ ఇప్పుడవి చాలా అరుదైపోయాయి. అందుకే ఇలాంటి బాలల లఘు చిత్రాలు తీయాలనుకునే వారు వేరే ప్రాంతాలకు వెళ్లి వేరే భాషలలో సినిమాలు చేస్తున్నారు. ఇదే బాటలో తెలుగు వాడైన గోవిందరాజు మరాఠీలో ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. అది ఇప్పుడు అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో బంగారు ఏనుగు కోసం పోటీ పడుతోంది.

గోవిందరాజు తీసిన సినిమా, కథ ఏమిటా అని ఆలోచిస్తున్నారా? మనం సమ్మర్లో ఎంతో ఇష్టంగా తినే మామిడి పండు గురించే ఈ సినిమా. ‘సోన్యాచా అంబ'(బంగారు మామిడి పండు). మామిడి పండు తినాలనుకునే ఓ పిల్లాడి కోరికని ఓ కల ద్వారా ఎలా తీర్చుకున్నాడు అనేదే ఈ చిత్ర కథాంశం. మరి మన తెలుగు వాడు మరాఠీలో తీసిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డు గెలుచుకోవాలని కోరుకుందాం.

Exit mobile version