పవన్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన బండ్ల గణేష్

పవన్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన బండ్ల గణేష్

Published on Jul 25, 2020 3:16 PM IST

వర్మకు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మధ్య ఎప్పటి నుండో వివాదం ఉండగా, పవర్ స్టార్ మూవీ తో ఈ గొడవ మరింత పెద్దది అయ్యింది. పవన్ ఫ్యాన్స్ వర్మపై తీవ్ర ఆగ్రహంతో ఉండగా, ఆయన మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కాగా నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ పని ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. నిన్న వర్మ పవర్ స్టార్ మూవీ గురించి ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కి బండ్ల గణేష్ లైక్ కొట్టాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డారు.

వర్మ ట్వీట్ కి మీరు ఎందుకు లైక్ కొట్టారని నిలదీశారు. దీనితో బండ్ల గణేష్ అది పొరపాటున జరిగిందని, తనను క్షమించాలని కోరారు. పవన్ భక్తుడుగా చెప్పుకొనే బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ ని కించపరిచేలా సినిమాలు తీస్తున్న వర్మ ట్వీట్ కి లైక్ కొట్టడం వారికి నచ్చలేదు. అందుకే నేరుగా బండ్ల గణేష్ ని టార్గెట్ చేయడం జరిగింది.

తాజా వార్తలు