ఫిబ్రవరిలో రానున్న బంగారు కోడిపెట్ట

Bangaru-Kodi-Petta-Movie-La
యంగ్ హీరో నవదీప్, క్యూట్ గర్ల్ కలర్స్ స్వాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బంగారు కోడిపెట్ట’. రాజ్ పిప్పళ్ళ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సునీత తాటి నిర్మిస్తోంది. రాజ్ పిప్పళ్ళ ఈ చిత్ర విశేషాల గురించి చెబుతూ ‘ ఈ సినిమాలో హీరో విలన్ ఒకరిని ఒకరు గెలవాలని వేసే ఎత్తుకి పై ఎత్తులు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో ఆడియోని రిలీజ్ చేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని’ అన్నాడు. మహేష్ శంకర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో గడసరి పిల్ల భానుమతి పాత్రలో కలర్స్ స్వాతి కనిపించనుంది. ఇలాంటి గడసరి పిల్లతో మా హీరో సాగించే ప్రేమాయణాన్ని తెరపైనే చూడాలంటున్నారు ఈ చిత్ర ప్రొడక్షన్ టీం.

Exit mobile version