రవితేజ మరియు శృతి హాసన్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “బలుపు” అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ప్రసాద్ వి పోట్లురి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు గతంలో గోపీచంద్ మరియు రవి తేజ కలయికలో “డాన్ శీను” చిత్రం వచ్చి విజయం సాదించింది. అలాంటి వినోదాత్మక అంశాలున్న మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. “గబ్బర్ సింగ్” చిత్రం తరువాత శృతి హాసన్ ఒప్పుకున్న మొదటి చిత్రం ఇదే. ఇందులో తన పాత్రకి మంచి హాస్యాన్ని పండించే అవకాశం ఉందని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రవితేజ మరియు శృతి హాసన్ కలయిక ఆశ్చర్యం కలిగించేదే, తెర మీద వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం రవితేజ “సార్ వస్తారా” చిత్రంలో నటిస్తున్నారు ఇది కాకుండా మరి కొంతమంది దర్శకులతో కథా చర్చల్లో ఉన్నారు శృతి హాసన్, ప్రభుదేవా రాబోతున్న చిత్రం “నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” హిందీ రీమేక్‌లో కనిపించనుంది.