ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుందని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘బలుపు’తో హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి డైరెక్టర్ గా ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం వీరభద్రం చౌదరి ‘భాయ్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయి.
బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. కామెడీ డిపార్ట్మెంట్ లో పుల్ క్రేజ్ ఉన్న రవితేజ – కామెడీని బాగా పండించగల వీరభద్రం కాంబినేషన్ లో సినిమా అనగానే ఆ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాము.