‘బలుపు’ సినిమా పై బ్రాహ్మణుల నోటిస్

Balupu
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘బలుపు’. ఈ సినిమా విడుదలకు ముందే వివాదంగా మరే పరిస్థితి తలెత్తింది.ఈ మద్య విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ లో బ్రాహ్మణుల మనోబావాలను కించపరిచే విదంగా కొన్ని సంభాషణలు వున్నాయని వాటిని తొలగించాలని ఆంద్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నేతలు బుదవారం సెన్సార్ బోర్డ్ వారికి, ఫిల్మ్ చాంబర్ వారికి వినతి పత్రాలను సమర్పించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సెన్సార్ జరగలేదు. కావున ఆ సంభాషణలను తొలగించాలని వారు కోరుతున్నారు. అంతేకాదు ట్రైలర్ లో కూడా ఈ సంభాషణలను తొలగించాలని వారు కోరడం జరిగింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీవీపీ సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా జూన్ 28న విడుదలకు సిద్దమవుతోంది.

Exit mobile version