50 రోజులు పూర్తిచేసుకున్న ‘బలుపు’

Balupu

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘బలుపు’ సినిమా ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. రవితేజ చాలా రోజుల తరువాత ఈ సినిమాతో మంచి విజయాన్ని సాదించాడు. ఈ సినిమాని చూసి ఫాన్స్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీవీపీ సినిమా బ్యానర్ పై నిర్మించాడు. శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. శృతి హసన్ గ్లామర్, బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి పెద్ద అసెట్ గా చెప్పవచ్చు. ప్రకాష్ రాజ్ నాజర్, అలీ, రఘుబాబు, అశుతోష్ రానాలు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో లక్ష్మీరాయి స్పెషల్ ఐటమ్ సాంగ్ ను చేసింది.

Exit mobile version