బెలూన్ లైటింగ్లో చిత్రీకరణ జరుపుకుంటున్న “గుండెల్లో గోదారి”


ఈ మధ్య కాలంలో చిత్రాలు తీయడంలో రక రకాల మార్పులు వస్తున్నాయి మరియు ఎన్నో కొత్త రకమైన సాంకేతిక విలువలను వాడుతున్నారు. అందులో భాగం గానే “గుండెల్లో గోదారి” చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలకు ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ పళనీ కుమార్ ఇప్పటి వరకూ ఎవరూ వాడని లైటింగ్ ఎఫ్ఫెక్ట్స్ ను వాడారు. ఈ చిత్రం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ గ్రామంలో చేపలు పడుతూ బతికే ఒక గ్రామాన్ని సెట్ గా వేశారు. మొత్తం 27 ఎకరాల ప్రాంగణంలో 120 గుడిసెలతో ఈ సెట్ ను నిర్మించారు.

ఈ చిత్రంలో రాత్రి పూట వరదలు వచ్చి జనం కొట్టుకుపోయే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉండగా, ఈ సన్నివేశంలో అందరూ నటీనటులు మటియు సాంకేతిక నిపుణులు అందరూ నీళ్ళల్లోనే ఉండాల్సిన కారణం వల్ల రాత్రుల్లో ఈ సన్నివేశాలను ఎలా తీయాలా అనే ఆలోచనలో ఉండగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ పళనీ కుమార్ బెలూన్ లైట్ ఐడియాతో ముందుకొచ్చారు. మీరు పైన చూస్తున్న ఫోటో అదే. ఈ బెలూన్ లైట్ వల్ల పగటి పూటే రాత్రి ఎఫ్ఫెక్ట్ తో తీయాల్సిన సన్నివేశాలను ఎంతో ఎఫ్ఫెక్ట్ గా తీయవచ్చు. నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ మంచు నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో లక్ష్మీ మంచు, ఆది మరియు తప్సీ లు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version