రేపు విడుదల కానున్న” ఊ కొడతారా ఉలిక్కి పడతారా ” ఆడియో


” నందమూరి బాలకృష్ణ ” మరియు ” మంచు మనోజ్ కుమార్ ” కథానాయకులుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ” ఊ కొడతారా ఉలిక్కి పడతారా ” చిత్రం ఆడియో వేడుక రేపు సాయంత్రం శిల్ప కళా వేదిక లో వైభవంగా జరగనుంది. ఈ సినిమా ఆడియో వేడుకకి చలనచిత్ర పరిశ్రమ నుండి చాల మంది అతిరధ మహారధులు రానున్నారు. ‘ దీక్షా సేథ్ ‘ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి శేఖర్ రాజ దర్శకత్వం వహించగా ,బొబో శశి సంగీతం అందించారు.’ మంచు లక్ష్మి ‘ నిర్మాతగా మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అత్యధిక బారీ వ్యయంతో,ఆదునిక సాంకేతిక విలువలతో నిర్మించబడుతోంది.

Exit mobile version