బాలయ్య బాబు సినిమాలంటే.. ఒన్లీ యాక్షన్, అలాగే బాలయ్య అభిమానులకు మాత్రమే ఆయన సినిమాలు అన్నట్లు ఉంటాయి. అందుకే ఆ రొటీన్ పరంపరలో బాలయ్య సరైన హిట్ కొట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు బాలయ్య మారాలనుకుంటున్నాడట. తన సినిమా కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్యలో మార్పు వచ్చిందట. ఇక నుండి అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని బాలయ్య సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక పై తానూ చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య పట్టుబడుతున్నారట.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కేవలం కొత్తదనం కోసమే బాలయ్య ఏకంగా గుండు కొట్టించుకున్నారట. అలాగే ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి బోయపాటి సైతం బాలయ్య అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ లో కొత్తదనం పెట్టాల్సి వచ్చిందట. ముఖ్యంగా బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేశారట బోయపాటి. అలాగే బి గోపాల్ సైతం బాలయ్య కోసం సాయి మాధవ్ చేత కొత్త కథను రాయిస్తున్నాడు అట. మొత్తానికి బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా అలాగే కొత్తగా చేసి.. ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. మరి బాలయ్య ఏ రేంజ్ కొత్తదనం చూపిస్తాడో చూడాలి.