‘బాలయ్య’ సినిమాలో మళ్ళీ పాత హీరోయినే ?

బాలయ్య బాబుకు కూడా హీరోయిన్ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా చాలా సహజమైన విషయం అయిపోయింది. కొత్తవారి నుండి ఫేడ్ అవుట్ హీరోయిన్స్ వరకూ ఇప్పటికే బాలయ్య దర్శకులు అందర్నీ చూసేశారు. అయినా బోయపాటికి మాత్రం హీరోయిన్ దొరకలేదు. అందుకే హీరోయిన్ ను ఫిక్స్ చేయకుండానే ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసి.. అలాగే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసేశాడు. నిజానికి ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని బోయపాటి చాలా ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త హీరోయిన్ కంటే కూడా తెలిసిన హీరోయిన్ అయితేనే బాగుంటుందని బోయపాటి ఫీల్ అవుతున్నాడట.

అందుకే హీరోయిన్ అంజలిని బాలయ్య బాబు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో పాటు పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను అలరించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇచ్చేలానే ఉన్నాడు.

Exit mobile version