‘అఖండ 2’.. ఈ క్లారిటీ కోసం అంతా వెయిటింగ్!

‘అఖండ 2’.. ఈ క్లారిటీ కోసం అంతా వెయిటింగ్!

Published on Jun 7, 2025 4:00 PM IST

నందమూరి బార్న్ కింగ్ నటసింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “అఖండ 2”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గట్టి ప్లానింగ్ లతోనే బోయపాటి తెరకెక్కిస్తుండగా ఈ కొన్ని రోజుల్లో అఖండ 2 తాండవం చూసేందుకు అంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే బాలయ్య పుట్టినరోజు ఈ జూన్ 10న వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రోజున సాలిడ్ టీజర్ ఉంటుంది అని బజ్ ఉంది. అయితే ఈ టీజర్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఒక క్లారిటీ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎదురు చూస్తున్నారు. టీజర్ ఉందా లేదా అనేది ఈ రెండు రోజుల్లో అయితే తేలనుంది. దాదాపు ఈ మే 8న అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా టాక్. అందుకే ఈ సాలిడ్ ట్రీట్ కోసం నందమూరి అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. మరి నిర్మాణ సంస్థ 14 రీల్స్ వారు ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు