కొద్ది విరామం తరువాత దర్శకుడు బాల మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.”పరదేశి” అనే పేరుతో రానున్న ఈ చిత్రంలో అథర్వ, వేదిక మరియు ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. 1940లో తమిళనాడులో టీ ఎస్టేట్ కార్మీకుల గురించి ఈ చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రంలో ప్రధాన తారాగణం అంతా ఈ చిత్రం కోసం వేషధారణ మార్చుకున్నారు. బాల గతంలో చేసిన “శివపుత్రుడు”, “వాడు-వీడు” వంటి చిత్రాలలానే ఇది కూడా విభిన్న చిత్రం కానుంది. ఈరోజు ఈ చిత్ర ఆడియో చెన్నైలో విడుదల అయ్యింది. ఈ చిత్ర ట్రైలర్ ఇంటర్నెట్లోకి వచ్చాక ప్రేక్షకులను చాలా ఆకర్షించింది. చూసిన ప్రతి ఒక్కరు బాల దర్శకత్వంని ప్రశంసలలో ముంచెత్తారు. “వాడు-వీడు” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందినా ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూస్తే బాల ఈసారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. జి.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.
బాల పరదేశికి అనూహ్య స్పందన
బాల పరదేశికి అనూహ్య స్పందన
Published on Nov 25, 2012 9:59 PM IST
సంబంధిత సమాచారం
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’