నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో బాలకృష్ణ కొత్త లుక్ చూసిన వారు బాగుందని అంటున్నారు. ‘ బాలకృష్ణ లుక్ చాలా బాగుంది. అతని హెయిర్, కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయని’ సమాచారం. బోయపాటి శ్రీను బాలకృష్ణని ‘సింహా’ సినిమాలో చాలా బాగా చూపించారు. చూస్తుంటే ఈ సినిమాలో కూడా అలానే కొత్తగా చూపించేలా ఉన్నారు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే సోనాల్ చౌహాన్ ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సినిమాతో మొదటి సారి దేవీశ్రీ ప్రసాద్ బాలకృష్ణకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.