కొద్ది రోజుల క్రితం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాకి ఒక్క చిత్రం కూడా ఎంపిక కాకపోవడం మీద నిర్వాహకులు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్నీ IFFI వాళ్ళు గమనించినట్టు తెలుస్తుంది ఈ ఫిలిం ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ మరియు అయన కొడుకు మోక్షజ్ఞను ఆహ్వానించారు. నవంబర్ 30న ఈ ముగింపు కార్యక్రమం జరగనుంది. మాకు అందిన సమాచారం ప్రకారం బాలకృష్ణ ఈ ఆహ్వానాన్ని మన్నించినట్టు తెలుస్తుంది. గతేడాది ఇదే ఫిలిం ఫెస్టివల్ లో బాలకృష్ణ మరియు నయనతార ప్రధాన పాత్రలలో వచ్చిన “శ్రీరామరాజ్యం” చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. భారతదేశంలో IFFI ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ ఇలాంటి ఫిలిం ఫెస్టివల్ కి బాలకృష్ణ ని ఆహ్వానించడం మంచి తరుణం. మరో మూడు చిత్రాలతో బాలకృష్ణ వంద చిత్రాలను పూర్తి చేసుకోనున్నారు. వందవ చిత్ర దర్శకుడి గురించి పలు పుకార్లు ఉన్నాయి ఈ చిత్రం 2013 చివర్లో మొదలుకానుంది.