గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025)లో ఆయన సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ గౌరవ కార్యక్రమంలో ఆయనకు పుష్పగుచ్ఛాలు, శాలువాతో ప్రత్యేక సన్మానం లభించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
బాలకృష్ణ తన సినీ జీవితం మొత్తంలో 100కి పైగా సినిమాల్లో నటించి, టాలీవుడ్లో మాస్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. రాజకీయంగా, క్యాన్సిర్ ఆసుపత్రితో సేవలు అందిస్తున్న బాలయ్యకు ఈ సత్కారం జరగడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
