నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లెజెండ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు మరియు వారాహి చాల చిత్ర వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా రాజీపడకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ పరంగా సినిమా భారీగా తీసున్నారు అనే విషయం పక్కన పెడితే, ఈ సినిమా కోసం బాలకృష్ణ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
బాలకృష్ణ ఈ సినిమా కోసం 8 కిలోల బరువు తగ్గి స్లిమ్ గా అయ్యారు. అలాగే ఆయన తన ఫిట్ నెస్ పై కూడా పూర్తి కేర్ తీసుకుంటున్నారని, ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం. బోయపాటి శ్రీను బాలకృష్ణ లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా 2014లో మొదట్లో రిలీజ్ కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.