నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్ కి సిద్దమవుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై మధ్య నుండి గుబాయ్ లో ప్రారంభం కానుంది. మేము విన్న సమాచారం ప్రకారం కొన్ని స్పెషల్ చేజ్ సీక్వెన్స్ లను దుబాయ్ ఎడారుల్లో, దుబాయ్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయనున్నారని సమాచారం. బాలకృష్ణ – బోయపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. మొదటి సారిగా యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ బాలకృష్ణ కి సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి కొర్రపాటి సమర్పకుడు. 2014 మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కూడా ‘సింహా’ అంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు.