కాపీ కొట్టానని ఒప్పుకున్న బాలకృష్ణ

కాపీ కొట్టానని ఒప్పుకున్న బాలకృష్ణ

Published on Nov 22, 2025 4:08 PM IST

Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘వీరసింహా రెడ్డి’ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాంచి మాస్ ఫీస్ట్ అందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది.

అయితే, ఈ సినిమాలో బాలయ్య లుక్స్ కన్నడ హీరో శివరాజ్ కుమార్ నుండి కాపీ కొట్టారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కాగా, ఇదే వార్తలపై తాజాగా బాలయ్య స్పందించారు. ‘అఖండ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు శివరాజ్ కుమార్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా వీర సింహారెడ్డి చిత్రం కోసం శివరాజ్ నటించిన ‘మఫ్టీ’ సినిమా నుండి ఆయన లుక్‌ను కాపీ కొట్టామని బాలయ్య అన్నారు.

దీంతో బాలయ్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘అఖండ 2’లో ఆది పినిశెట్టి, సంయుక్త తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

తాజా వార్తలు