ఈ రాత్రితో ముగియనున్న ‘బాద్షా’ డీఐ వర్క్

Baadshah9
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమా విడుదల కోసం తెలుగు సిని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుపుకుంటోంది. ఈ రాత్రితో డీఐ వర్క్ ని ముగించుకోనుందని తాజా సమాచారం. ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ముగించుకొని ఏప్రిల్ 1న సెన్సార్ జరుపుకోవడానికి సిద్దమవుతోంది.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియో ఈ మధ్యే విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సమ్మర్ విడుదలై ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదలకానుంది.

Exit mobile version