‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.. స్మార్ట్ బాయ్, టీజర్ ఎలా ఉందంటే ?

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.. స్మార్ట్ బాయ్, టీజర్ ఎలా ఉందంటే ?

Published on Oct 6, 2025 2:06 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా చేస్తున్న సినిమా “బ్యాడ్ బాయ్ కార్తీక్”. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ‘బ్యాడ్ బాయ్ అనుకుంటే స్మార్ట్ బాయ్ లా ఉన్నావ్’ అంటూ సాగిన ఈ టీజర్ లో.. నాగశౌర్య ఎనర్జిటిక్ లుక్ లో కనిపించాడు. పోలీస్ పాత్రలో సాయి కుమార్, సీరియస్ లుక్ లో పూర్ణ లాంటి ఆర్టిస్ట్ లను టీజర్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే, టీజర్ లో కొట్టిన బిజిఎమ్ కూడా బాగుంది. ఇక ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కట్స్ బాగున్నాయి.

అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం టీజర్ కి బాగా ప్లస్ అయింది. దర్శకుడు రామ్ దేసిన తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విధి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. వైష్ణవి ఫిల్మ్స్ తమ బ్యానర్ లో మొదటి సినిమాగా ఈ చిత్రానికి వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగశౌర్య ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

తాజా వార్తలు