‘స్నేహ గీతం’ డైరెక్టర్ మధుర శ్రీధర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా’ షూటింగ్ పూర్తి చేసుకుంది. మహాత్ రాఘవేంద్ర హీరోగా తెలుగు వారికి పరిచయమవుతున్న ఈ సినిమాలో పియా బాజ్పాయ్, అర్చన కవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో మధుర శ్రీధర్ తన టీంని పరిచయం చేస్తూ ‘ నా కెరీర్ కి ఒక పిల్లర్ లా, నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చిన మల్టీ డైమెన్షన్స్ ప్రై లిమిటెడ్ కి చెందిన వాసుకి నా ధన్యవాదాలు. మేము అనుకున్న టైం మూడు నెలల కానీ 55 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసాం. ఈ సినిమా ఒక ట్రై యాంగిల్ లవ్ స్టొరీ. బి.టెక్ చదువుతూ 16 బ్యాక్ లాగ్స్ పెట్టుకొని అటు ఫ్యామిలీ ఇటు ఇద్దరమ్మాయిల ఒత్తిడిని ఎదుర్కునే ఒక అబ్బాయి స్టొరీ ఇదని’ అన్నారు.
లక్ష్మి భూపాల్ – వెంకట్ సిద్దా రెడ్డి స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి ప్రసాద్ జి.కె సినిమాటోగ్రాఫర్. మల్టీ డైమెన్షన్స్ ప్రై లిమిటెడ్ సమర్పణలో షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ పై ఎం.వి.కె రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో గీతాంజలి సినిమాలో హిట్ అయిన జగడ జగడ పాటని రీమిక్స్ చేసారు. ఈ పాటని తమిళ నటుడు శింబు – అనిరుధ్ కలిసి పాడారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్న ఈ సినిమా 2013 మొదట్లో విడుదల కానుంది.