మధుర శ్రీధర్ లేటెస్ట్ సినిమా “బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్” ఈ నెల చివరన విడుదల కాబోతుంది. మహాత్ రాఘవేంద్ర ఈ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాలో పియా బాజ్ పాయ్, అర్చనకవిలు కథానాయికలుగా నటిస్తున్నారు. షిరిడి సాయి కంబైన్స్ మరియు మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై ఎమ్.వి.కే రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం పోస్ట్-ప్రోడక్షన్ జరుగుతుంది.మహాత్ రాఘవేంద్ర ఈ సినిమాకు సొంతంగా చెప్పుకున్నాడు. ఈ సినిమా పాటలను ఫిబ్రవరి 16 న విడుదల చేయబోతున్నారని సమాచారం. దీనికి సంగీతాన్ని సునీల్ కశ్యప్ అందిస్తున్నారు. ఈ ఆడియోలో ముఖ్యంగా జగడ జగడ పాటను గీతంజలి సినిమా నుండి రీమిక్స్ చేశారని దీనిని సింబు మరియు సంగీత దర్శకుడు అనిరుధ్ (కోలవరి ది ఫేమ్) లు కంపోస్ చేసారని సమాచారం. ఈ సినిమాకు ప్రసాద్ జి కే సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.