ఐశ్వర్య రాయ్ నవంబరు 16న ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుండి ఐశ్వర్య అభిమానులందరూ ఆ పాప ఎలా ఉంది అన్న విషయం తెలుసుకోవాలనే ఉబలాటంతో ఉన్నారు. వారందరికీ శుభవార్త. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ ల కూతురు బేటీ బి అచ్చం తల్లి పోలికలతో ఉందని అమితాబ్ మరియు అభిషేక్ ధ్రువీకరించారు. బిగ్ బి ఫ్యామిలీ బేటీ బి విషయాలను మీడియా కంటపడకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఐశ్వర్య వచ్చే ఏడాది వేసవి నుంచి తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.