గాయపడ్డ బాబా సెహగల్.!

Baba_Sehgal_injured

ఫేమస్ సింగర్ బాబా సెహగల్ కొద్ది రోజులకు ముందు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘రుద్రమ దేవి’ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. కొద్ది రోజులకు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో బాబా సెహగల్ నాగ దేవుడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ జరుగుతుండగా ఆయన పాదానికి గాయం అయ్యింది. కొద్ది రోజుల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. ఈ సినిమాలో అనుష్క , రానా దగ్గుపాటిలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అనుష్క ఈ సినిమాలో ఒక యోదురాలైన యువరాణిగా, అలాగే రానా చాళుక్య వీరభద్రగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version