యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి వీడియో

bahubali-first-look
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ‘బాహుబలి’ మేకింగ్ వీడియోనిరిలీజ్ చేసారు. ఈ వీడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లో 3 లక్షల మంది ఈ వీడియోని వీక్షించారు.

ప్రభాస్ రాయల్ లుక్ మరియు ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ వీడియోలో హైలైట్ గా నిలిచాయి. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ 2015 లో రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ మూవీకి పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేస్తున్నాడు.

బాహుబలి మేకింగ్ వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి – బాహుబలి.

Exit mobile version