జూన్ నుంచి మొదలు కానున్న బాహుబలి

Baahubali
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బాహుబలి’. ప్రస్తుతం పీరియడ్ అడ్వెంచర్ గా రానున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముందుగా చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా మే నుంచి మొదలు కావాలి కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమాని భారీ ఎత్తున షూట్ చేయనున్నారు. ఈ సినిమాని ఆర్కా మీడియా వారు సుమారు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని అంచనా వేస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. 2014 లో రిలీజ్ చేసే విధంగా ఈ సినిమా ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version