బాహుబలి ది ఎపిక్.. అందులోనూ ట్రెండ్ సెట్ చేస్తుందా..?

Baahubali The Epic

ప్రస్తుతం కొత్త సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం కామన్ అయిపోయింది. భారీ చిత్రాతలతో పాటు చిన్న సినిమాలు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఇక దీపావళి కానుకగా రాబోతున్న సినిమాలు కూడా ఇప్పుడు ఇదే స్ట్రాటెజీలో వెళ్తున్నాయి. అయితే, కొత్త సినిమాలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు పాత సినిమాలు సైతం ఫాలో కానున్నట్లు తెలుస్తోంది.

పదేళ్ల క్రితం విడుదలైన సినిమాను రీ-రిలీజ్ చేస్తూ దానికి కూడా స్పెషల్ ప్రీమియర్స్ వేయడం మాత్రం అరుదైన విషయమే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన మేగ్నమ్ ఓపస్ చిత్రం ‘బాహుబలి: ది ఎపిక్’ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు తెలుస్తోంది. 2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న విడుదల చేస్తున్నారు.

‘బాహుబలి’ని ఒకే కథలా అనుభవించాలనుకునే ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతి ఇవ్వనుంది. రీ- రిలీజ్ తేదీ 31 అయినప్పటికీ, అంతకు రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తెలుగు, హిందీ భాషల్లో సెలబ్రిటీ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. దీంతో రీ-రిలీజ్ చిత్రాల ప్రీమియర్స్‌ను కూడా ఈ చిత్రం ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version