ఇండియన్ సినిమా దగ్గర పానిండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూసిన రీరిలీజ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా ఇప్పుడు వచ్చిన బాహుబలి ది ఎపిక్ అనే చెప్పాలి. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చి ఒక్క ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది.
ఇలా రీరిలీజ్ సినిమాల్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు మొదటి రోజు రాబోతున్నట్టు ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నాయి. ఇలా మొదటి రోజుకు బాహుబలి ది ఎపిక్ ఈజీగా 15 కోట్లకి పైగా ఓపెనింగ్స్ సాధిస్తుందట. ఇది సుమారు 20 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. సో మొత్తానికి ఓ రికార్డ్ ఓపెనింగ్స్ తోనే బాహుబలి మళ్లీ చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
