వినూత్నమైన టెక్నిక్స్ ఉపయోగిస్తున్న బాహుబలి టీం

Baahubali_new
ఫిల్మ్ మేకింగ్ లో వినూత్నమైన టెక్నిక్స్ ని ఉపయోగించే విషయానికి వస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోఎస్ఎస్ రాజమౌళి ముందుంటాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన టెక్నాలజీతో ఏం చెయ్యచ్చు అనేదాన్ని ‘ఈగ’ సినిమాతో చేసి చూపించాడు. ఇప్పుడు ఆయన తన ప్రాణం పెట్టి చేస్తున్న పీరియాడిక్ డ్రామా ‘బాహుబలి’.

ఈ సినిమా యొక్క భారీ బడ్జెట్సె ఈ సినిమాకోసం చాలా సెట్స్ ని, ఎక్కువ వస్తువులని ఉపయోగిస్తున్నారు. వీటన్నిటినీ రీచ్ కావడం కోసం ఈ చిత్ర టీం సరికొత్త విధానాన్ని ఫాలో అవుతోంది. రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పెద్ద ఖాళీ ప్రదేశాన్ని తీసుకున్నారు, ఇందులో సుమారు 200 మంది ఈ సినిమాకి సంబందించిన వస్తువుల కోసం పనిచేస్తున్నారు. అవార్డు గెలుచుకున్న ఆర్ట్ డైరెక్టర్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ సబు సైరిల్ ఈ టీంని హ్యాండిల్ చేస్తున్నారు. ఈ టీం రిమోట్ తో కంట్రోల్ చేయగలిగిన కొన్ని జంతువులని కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం.

2015లో రిలీజ్ కానున్న బాహుబలి సినిమాతో ఆడియన్స్ కచ్చితంగా అద్భుతమైన విజువల్స్ అనుభూతికి లోనవుతారు అనడంలో గ్యారంటీగా చెప్పొచ్చు. ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా కనిపించనుంది. ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మించనున్నారు.

Exit mobile version