రీరిలీజ్ కి పక్క స్టేట్ లో కూడా ఆల్ టైం రికార్డ్ కొట్టిన ‘బాహుబలి’

Baahubali The Epic

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో బాహుబలి సిరీస్ కూడా ఒకటి. ఏకంగా భారతదేశం అంతటితో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకొని ఇండస్ట్రీ హిట్ అయ్యిన సినిమాగా బాహుబలి చరిత్ర పుటల్లో నిలిచింది. అయితే లేటెస్ట్ గా ఇదే ఘనత రీ రిలీజ్ లో కూడా చూపించినట్టు తెలుస్తోంది.

ఇటీవల విడుదల అయ్యిన బాహుబలి ది ఎపిక్ సినిమా కర్ణాటకలో ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ మూడున్నర కోట్లకి పైగా గ్రాస్ అందుకొని కర్ణాటక రాష్ట్రంలో రీరిలీజ్ అయ్యిన సినిమాలు అన్నిటి కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది అని తెలుస్తోంది. సో ఇలా రీ రిలీజ్ లో కూడా బాహుబలి సత్తా చాటుతుంది అని చెప్పాలి.

Exit mobile version