యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘బాద్షా’ చిత్ర రెండవ షెడ్యూల్ ప్రస్తుతం బ్యాంకాక్లో జరుగుతోంది. బాంకాక్లో ఈ చిత్ర చిత్రీకరణ అనుకున్న దాని కంటే ముందుగానే పూర్తవుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 వరకు చిత్రీకరణ జరిపి ముఖ్యమైన టాకీ పార్ట్ పూర్తి చెయ్యాలనుకున్నారు. ఈ చిత్ర మొత్తం టీం చిత్రీకరణ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 10వ తేదీ హైదరాబాద్ కి రానున్నారు. ఈ విషయాన్ని శ్రీను వైట్ల భార్య రూప వైట్ల ట్విట్టర్లో పేర్కోన్నారు. ‘ బాద్షా రెండవ షెడ్యూల్ సెప్టెంబర్ 10 కల్లా పూర్తవుతుంది, ఆ తర్వాత హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతుందని మరియు సినిమా చాలా బాగా వస్తోందని అందుకు శ్రీను వైట్ల చాలా ఆనందంగా ఉన్నారని’ ఆమె ట్వీట్ చేసారు.
ఈ చిత్ర చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్ళిన నవదీప్ ‘బాద్షా’ షెడ్యూల్స్ తారు మారవడం వల్ల హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి మోహన్ మరియు కోన వెంకట్ కథ అందించగా ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. డాషింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2013 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.