ఈ వారాంలోనే బాద్షా కొత్త షెడ్యూల్

ఈ వారాంలోనే బాద్షా కొత్త షెడ్యూల్

Published on Jan 7, 2013 9:00 PM IST

Baadshah
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది, అలాగే ఎన్.టి.ఆర్ జనవరి 18 నుంచి ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి కావడానికి 18 రోజులు పడుతుంది, అలాగే మరో నాలుగు సాంగ్స్ షూట్ చేయాల్సి ఉంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని, అలాగే ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మూడు సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని బండ్ల గణేష్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. కోనా వెంకట్ – గోపీ మోహన్ కథ అందించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆడియో మార్చి మొదటి వారంలో అలాగే సినిమా రిలీజ్ మార్చి చివర్లో ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు