ఈ రోజుతో ముగియనున్న బాద్షా డి.టి.ఎస్ మిక్సింగ్

Baadshah-21
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ అవతారంలో మన ముందుకు రానున్న సినిమా ‘బాద్షా’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబందించిన డి.టి.ఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డి.టి.ఎస్ పనులు పూర్తి కాగా, ఈ రోజు సాయంత్రానికి సెకండాఫ్ కి సంబందించిన డి.టి.ఎస్ కార్యక్రమాలు కూడా ముగియనున్నాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమా ఫస్ట్ కాపీని రేపు (అనగా ఏప్రిల్ 1న) సెన్సార్ కార్యక్రమాల కోసం సెన్సార్ బోర్డ్ కి పంపనుంది. రేపు సాయంత్రంలోగా సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏమన్నా కట్స్ విధించారా అన్న విశేషాలు మనకు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాని ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కి , కామెడీ ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఎస్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ మూవీ ఆడియో ఆల్బమ్ మార్కెట్లో సూపర్ హిట్ గా నిలిచింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించారు. ‘బాద్షా’ ఎన్.టి.ఆర్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని బండ్ల గణేష్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. బాద్షా సినిమాకి సంబందించిన మరిన్ని ప్రత్యేకమైన వార్తల కోసం మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version