పొట్ట చెక్కలయ్యే కామెడీతో అలరించనున్న బాద్షా.!

పొట్ట చెక్కలయ్యే కామెడీతో అలరించనున్న బాద్షా.!

Published on Mar 15, 2013 8:27 AM IST

Baadshah
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా విడుదలకి దగ్గరవుతున్న కొద్దీ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. మాములుగా శ్రీను వైట్ల తన సినిమాల్లో హై కామెడీకి పెట్టింది పేరు. తన అన్ని సినిమాల్లాగానే ఈ సినిమాలో కూడా కామెడీ ఉండనుంది అందులో ఏ మార్పు లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పొట్ట చెక్కలయ్యేలా కామెడీ ఉంటుందని చెబుతున్నారు.

ఈ సినిమా రైటర్స్ గోపి మోహన్ – కోనా వెంకట్ బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ కోసం ఫుల్ కామెడీగా ఉండే డైలాగ్స్ రాసారు. ఇండస్ట్రీ నుంచి తెలిసిన సమాచారం ప్రకారం ‘బాద్షా’లో బ్రహ్మానందం ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా. ఎం.ఎస్ నారాయణ ఫిల్మ్ డైరెక్టర్ గా కనపడనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు