ఫస్ట్ డే తూర్పు గోదావరి జిల్లాలో రికార్డ్స్ బద్దలు కొట్టిన బాద్షా

Baadshah-(3)యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించిన ‘బాద్షా’ సినిమా తూర్పు గోదావరి జిల్లాలో ఫస్ట్ డే రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. అన్నీ కలుపుకొని ఈ సినిమా మొదటి రోజు సుమారుగా 1.24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ అమౌంట్ ఈ ఏరియాలోనే అత్యధిక కలెక్షన్ కావడం విశేషం. ప్రతి ఏరియాలోనూ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎన్.టి.ఆర్ డైలాగ్స్, డాన్సులు, కాజల్ బంతి ఫిలాసఫీ, బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్స్.

గోపి మోహన్, కోనా వెంకట్ తో శ్రీను వైట్ల కలిసి సినిమా సెకండాఫ్ ని చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చేలా రాసుకున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించిన బండ్ల గణేష్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్, కలెక్షన్స్ చూసి ఎంతో సంతోషంగా ఉన్నారు. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version