కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున విడుదలవుతున్న బాద్షా

Baadshah-4
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా కృష్ణా జిల్లాలో గ్రాండ్ గా శుక్రవారం రోజు విడుదల కానుంది. కృష్ణా జిల్లాలో ఈ సినిమా 80 కంటే ఎక్కువ థియేటర్లలో విడుదల కానుంది, ఈ సినిమాకు అక్కడ భారీగా డిమాండ్ ఉండటమే ఇదీనికి కారణం.
ఇండస్ట్రీలో ఈ సినిమాకి పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అలాగే ఎన్.టి.ఆర్, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణల కామెడీ సీక్వెన్స్ లు ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించాడు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్ ఓ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం స్పెషల్ అట్రాక్షన్.

Exit mobile version