సెన్సార్ పూర్తి చేసుకున్న బాద్షా

Baadshah
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ సభ్యులు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల చేయనున్నారు. బండ్ల గణేష్ ఈ సినిమా భారీ విజయాన్నిసాదిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణలు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి కామెడీ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version