అద్బుతమైన రెస్పాన్స్ సంపాదించుకున్న ‘బాద్షా’

Baadshah8
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా ఈ రోజు ఉదయం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని ప్రదేశాలల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ డాన్స్ లు, కామెడీ చాలా భాగున్నాయి. ఈ సినిమా థియేటర్స్ వద్ద భారీగా జనం, అబిమానులు హడావిడిగా వుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం ఇన్స్ పెక్టర్ పద్మనాభ సింహ పాత్రలో అద్భుతంగా నటించాడు. కాజల్ అగర్వాల్ చెప్పే ‘బంతి ఫిలాసఫీ’ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ డే ఈ సినిమా మంచి కలెక్షన్ లను నమోదు చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించాడు. థమన్ సంగీతాన్ని అందించగా గోపి మోహన్, కోన వెంకట్ లు స్క్రిప్ట్ అందించారు.

ఈ సినిమాకు సంబందించిన సమాచారాన్ని ఎప్పడికప్పుడు 123తెలుగు.కామ్ ద్వారా మీకు అందజేస్తూ ఉంటుంది.

Exit mobile version