వన్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసే దిశగా బాద్షా.!

Baadshah-(4)
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్ షా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది అలాగే సూపర్బ్ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఈ సినిమా రెవిన్యూ యు.ఎస్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ సినిమా చాలా ఈజీగా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

సమ్మర్ హాలిడేస్ కావడం తో ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ గా మారింది. అలాగే ఎన్.టి.ఆర్ కెరీర్లోనే అత్యధిక గ్రాసర్ గా నిలుస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని బండ్ల గణేష్ నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.

Exit mobile version