బాద్షా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా బాద్షా ఇటీవలే యూరోప్ మరియు బ్యాంకాక్లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ కి సంభందించిన ఎడిటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శ్రీను వైట్ల ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు సినిమాని వేగంగా పూర్తి చేసి సంక్రాంతి వరకు విడుదల చేయాలనే సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం. బృందావనం తరువాత ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జోడీ మరోసారి ఈ సినిమాలో కనువిందు చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్ లో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ కి మంచి స్పందన వస్తుండగా ఈ నెల 24 న ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న బాద్షా చిత్రానికి కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version