మొదలైన ‘బాద్షా’ సెన్సార్ స్క్రీనింగ్

Baadshah9
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పుడే మొదలైయ్యాయి. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ రోజు మద్యాహ్నానికి గానీ లేదా సాయంత్రానికి గానీ ఈసినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేయవచ్చు. ఈ సమ్మర్లో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ తెలుగు సినిమా ఇది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్.టి.ఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం.

Exit mobile version